బీజేపీ జాతీయ నాయకుడు సునీల్ బన్సల్ తెలంగాణలో పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రియాశీల సభ్యత్వ ప్రక్రియలో మోసం జరిగిందని, నాయకులు పార్టీని దగా చేశారని విమర్శించారు. సుమారు 9 వేల మంది సభ్యత్వం తీసుకోకుండానే తీసుకున్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. మూడు నెలల క్రితం పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని, తాను డైరీలో రాసుకున్న వివరాలు ఇప్పుడు చెబుతున్నవి ఒకటేనని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల నిర్లక్ష్యం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని హెచ్చరించారు.

సునీల్ బన్సల్ పార్టీ నిర్మాణంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే నెల నాలుగో తేదీలోపు మిగిలిన మండలాల్లో అధ్యక్ష నియామకాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మే 15 నాటికి పూర్తి స్థాయిలో మండల కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీల్లో 11 మంది సభ్యులు ఉండాలని, అందులో ముగ్గురు మహిళలు, ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఉండాలని నిబంధన విధించారు. కమిటీల్లో క్రియాశీల సభ్యులు మాత్రమే ఉండాలని ఉద్ఘాటించారు.

మే 15 తర్వాత రెండు ఉమ్మడి జిల్లాల వారీగా మండల అధ్యక్షుల సమావేశాలు నిర్వహించాలని బన్సల్ సూచించారు. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు నియామకం అనంతరం జిల్లా కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీలో వ్యవస్థీకృత నిర్మాణం, సమర్థ నాయకత్వం అవసరమని పునరుద్ఘాటించారు. నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పార్టీ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశం రాష్ట్ర నాయకులకు హెచ్చరికగా నిలిచింది.

94905 20108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP