- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్న నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ఇన్చార్జిలను నియమించడానికి నాయకులను కూడా సిద్ధం చేసినట్టు విశ్వస‌నీయ‌ వర్గాల సమాచారం. ఇందులో ఎక్కువగా ఎస్సీ రిజర్వ్ డ్‌ నియోజకవర్గాలు ఉన్నాయ‌ట‌. వీటిల్లో తిరువూరు - రైల్వే కోడూరు అలాగే రాజంపేట - శింగ‌నమల నియోజకవర్గాలతో పాటు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పై స్థానికంగా కొంత పార్టీ శ్రేణులు వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు .. మంత్రి నారా లోకేష్ ఈ నియోజకవర్గ టిడిపి సమన్వయకర్తగా చింతకుంట శ్రీనివాస్ రెడ్డిని నియమించడానికి నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.


చింతకుంట శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన తాత సిపి తిమ్మారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన అఖిలప్రియకు సమీప బంధువు అని తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి, రాజమండ్రి - హైదరాబాదు లాంటి నగరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారని సమాచారం. ఇక ఇటీవల కాలంలో చికెన్ సెంటర్ ల నుంచి కూడా కమీషన్లు వసూలు చేస్తున్నారని దీని వెనక అఖిలప్రియ అనుచరులు ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం పార్టీ ప్రతిష్ట మంటగలుపుతున్నట్టు అయింది. ఈ క్రమంలోనే టిడిపి పెద్దలు అక్కడ నాయకత్వం మార్పుతో పార్టీపై వ్యతిరేకత తగ్గించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే శ్రీనివాస్ రెడ్డికి ఆళ్లగడ్డ నియోజకవర్గం అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: