తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రజానీకం చూపు మొత్తం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పడింది. దీంతో చాలామంది ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ ఎన్నిక అనేది అన్ని పార్టీలకు ఒక బూస్టింగ్ ఇచ్చే ఎన్నిక అని చెప్పవచ్చు.  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారాన్ని కోల్పోయింది. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే రాబోవు రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ఎలాగైనా  పుంజుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ సాధించాలనే ప్రయత్నం చేస్తోంది. కాస్త చతికిల పడ్డ కార్యకర్తల్లో జోష్ పెంచాలి అంటే తప్పనిసరిగా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలవాలని వారు భావిస్తున్నారు. అదే దిశగా కేటిఆర్, హరీష్ రావు పూర్తిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు.

 ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ నాయకులను అక్కడికి దించి ప్రచారాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈ పార్టీ నుంచి లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్ వస్తుందని వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇక ఈ రెండు పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారై ప్రచారం చేస్తున్న సమయంలో, బిజెపి మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉంది. మరి దీనికి కారణం ఏంటి అనే వివరాలు చూద్దాం.. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ముగ్గురి పేర్లతో లిస్టు పంపించింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మాల పేర్లను ఫైనల్ చేసి అధిష్టానానికి పంపించారు. కానీ దీనిపై బిజెపి అధిష్టానం పెద్దలు కాస్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ లో బీసీ నినాదం వినబడుతోంది.అలాగే లోకల్ కాండిడేట్ అనే ఆలోచన కూడా చేస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే బీసీ నుంచి అభ్యర్థి పేరు ప్రకటించాలని అలాగే లోకల్ క్యాండిడేట్ బీసీ అయి ఉండాలని బిజెపి అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు కూడా బీసీ నేతలు లేరు. నాన్ లోకల్ క్యాండిడేట్ ను పెడితే బాగుండదు..అందుకే బిజెపి అధిష్టానం ఆ అభ్యర్థి కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరో కారణం  ఏంటంటే ఇక్కడ బిజెపి నామ మాత్రపు క్యాండిడేట్ ను పెడితే కాంగ్రెస్ గెలుస్తుంది. దీనివల్ల రాబోవు రోజుల్లో బిజెపికి మేలు కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కసారి ఓడిపోతే ఇక ఆ కాండిడేట్ మళ్ళీ అక్కడ గెలవడం కష్టం. బీఆర్ఎస్ ఉన్న స్థానాలన్ని మొత్తం బిజెపి అధిరోహించవచ్చని ప్లాన్ చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: