భారత క్రికెట్లో కెప్టెన్సీ మార్పుకు సంబంధించిన చర్చ గత కొంతకాలం నుంచి జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఇక ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కూడా రోహిత్ కి అప్పగిస్తారు అంటూ ప్రచారం మొదలైంది. కొందరు అనుకున్నట్లుగానే విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బిసిసిఐ. వన్డే కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మ కు అప్పగించింది. ఇలా విరాట్ కోహ్లీ ని కెప్టెన్సీ నుంచి తప్పించడం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ముందు విరాట్ కోహ్లీ కి సమాచారం ఇచ్చాము అంటూ బీసీసీఐ తెలిపింది. అయితే ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన కోహ్లీ తనకు కేవలం గంటన్నర ముందు మాత్రమే సమాచారం అందించారు అంటూ చెప్పడంతో కెప్టెన్సీ మార్పు వివాదం కాస్త మరింత ముదిరింది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే అసలు కెప్టెన్సీ మార్పు విషయంలో జరిగింది ఏంటి.. విరాట్ కోహ్లీ  జట్టు సెలెక్షన్ కమిటీ మధ్య ఏమైనా చర్చలు జరిగాయా లేదా అన్న దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇక ఈ ఘటనపై సెలక్షన్ కమిటీ స్పందిస్తూ అసలు విషయం చెబితే బాగుంటుంది అని ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ చైతన్ శర్మ ఈ విషయంపై స్పందిస్తూ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న సమయంలోనే వద్దు అని చెప్పామని జట్టు కోసం అయినా కొనసాగాలి అంటూ కోరాము అంటూ చేతన్ శర్మ తెలిపారు. ఇక ఎంతమంది చెప్పినప్పటికీ కోహ్లీ తన నిర్ణయానికి కట్టుబడి ఉండటం తో ఆ సమయంలోనే వన్డే కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ కోహ్లీని తప్పించాలని నిర్ణయించుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు.


 పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదని సెలెక్షన్ కమిటీ భావించింది అంటూ తెలిపారు  అయితే టి20 వరల్డ్ కప్ కి ముందే విరాట్ కోహ్లీ కి ఈ విషయం చెబితే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి టి20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని చెప్పాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టును ఎంపిక చేసినప్పుడు వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పిస్తున్నట్లు ప్రకటించాము. ఇటీవలే వన్డే సిరీస్ జట్టును ప్రకటిస్తే జట్టు సారథి మార్పు గురించి మాత్రం టెస్టు జట్టును ప్రకటించినప్పుడే వెల్లడించాము అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: