భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు క్రికెట్ ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు. ఈ రెండు జట్ల మధ్య జరగ బోయే మ్యాచ్ ను కేవలం ఒక సాదాసీదా మ్యాచ్ గా కాకుండా అది ఒక ఎమోషన్ అన్న విధం గానే చూస్తూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తం గా ఉన్న క్రికెట్ అభిమానులందరూ భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే ఉత్కంఠ భరితమైన దాయాదుల పోరును వీక్షించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారని చెప్పాలి.


 ఇకపోతే ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుండగా.. అక్టోబర్ 23వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ జరగ బోతుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత ఏడాది టి20 ప్రపంచ కప్ లో మొదటిసారి పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. కానీ ఇప్పుడు మాత్రం దెబ్బకు దెబ్బ కొట్టి ప్రతికారం తీర్చుకోవాలని భావిస్తుంది. గత ఏడాది వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది టీమిండియా ఓటమి శాసించాడు అని చెప్పాలి.


 అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టాడు. మరి ఈ ఏడాది అతను ఎలా రానిస్తాడో అన్న విషయం పై ఆసక్తికర చర్చ జరుగుతుండగా..  ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందిస్తూ పలు సూచనలు చేశారు. ఇండియన్ బ్యాట్స్మెన్లు పాకిస్తాన్ యువ ఫేసర్ షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో రక్షణాత్మకంగా ఆడొద్దని.. అటాక్ చేయాలని సూచించాడు  కొత్త బంతితో షాహిన్ ఎంతో ప్రమాదకరం. అందుకే వికెట్ కాపాడుకోకుండా అతని బౌలింగ్లో అటాక్  చేయాలి. అలాగే బాబర్ అజం - మహమ్మద్ రిజ్వాలను ఎక్కువసేపు ఉండనివ్వద్దు.. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయాలి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: