డేవిడ్ వార్నర్ విషయంలో ఇంకా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వివక్షపూరితంగా వ్యవహరిస్తుందా అంటే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఘటనలు మాత్రం అవును అనే సమాధానమే వచ్చేలా చేస్తూ ఉన్నాయ్. ఎందుకంటే గతంలో బాల్ టాంపరింగ్ విభాగంలో డేవిడ్  వార్నర్ ఇరుక్కున్నాడు. ఈ సమయంలోనే ఇక అతనిపై రెండేళ్లపాటు నిషేధం విధిస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు జీవితకాల కెప్టెన్సీ నిషేధం కూడా విధించింది.


 అయితే ఈ వివాదంలో అతనితో పాటు ఇరుక్కున్న ఆటగాళ్లపై మాత్రం అటు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు అని చెప్పాలి. ఇకపోతే ఇక బాల్ టాంపరింగ్ వివాదం ముగిసిపోయింది. ఇక ఇప్పుడు స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ విషయంలో ఉన్న కెప్టెన్సీ నిషేధం మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తొలగించబోతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ చర్చ రావడానికి కారణం కూడా లేకపోలేదు. పరిమితి ఓవర్ల ఫార్మాట్ కి కెప్టెన్ గా ఉన్న ఆరోన్ పించ్ వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.


 టి20 ఫార్మాట్ కెప్టెన్ గా మాత్రం కొనసాగుతాను అంటూ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ అటు డేవిడ్ వార్నర్కు దక్కే అవకాశం ఉందని అందరూ భావించారు.  వార్నర్ పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేసి అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్సీ అప్పగించబోతుంది ప్రచారం కూడా జరిగింది. ఇక ఇందుకు  సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూశారు. కానీ ఎవరు ఊహించిన విధంగా డేవిడ్ వార్నర్ ను కాదని ఆ జట్టు స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ కి ఇటీవలే వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఈ విషయం తెలిసి వార్నర్ పై ఇంత వివక్ష ఎందుకు అంటూ కామెంట్ చేస్తున్నారూ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: