ప్రస్తుతం భారత్ ,ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. అయితే వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా జట్టు మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో మూడో మ్యాచ్లో పుంజుకున్న  ఆస్ట్రేలియా జట్టు.. టీమ్ ఇండియాని l సొంత గడ్డమీద దెబ్బ కొట్టి తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో ఇక సిరీస్ గెలుచుకోవాలంటే టీమిండియా నాలుగు మ్యాచ్ లలో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.


 ఒకవేళ నాలుగు మ్యాచ్ లలో గెలిస్తే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగుపెడుతుంది టీమిండియా. అయితే ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ మధ్య టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత్ లో ఉన్న స్పిన్ పిచ్ ల గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇదే విషయంపై భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్   ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసి పాయింట్లు సాధించాలనే తత్వంతోనే ఆయా దేశాలు తమకు అనుకూలంగా పిచ్ లను తయారు చేసుకుంటూ ఇక ఫలితాలు సాధిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు.  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వల్లే ఇదంతా జరుగుతుందంటూ చెప్పుకొచ్చాడు.


 ఇండోర్ పిచ్ గురించి ఎక్కువగా మాట్లాడను. మ్యాచ్ రిఫరీ అంతా చూసుకుంటాడు. అయితే ఇక మ్యాచ్ రిఫరీ  నిర్ణయంతో నేను ఏకీభవించాల్సిన అవసరం కూడా లేదు. డబ్ల్యూటీసీ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమకు అనుకూలంగా ఫలితాలను ఇచ్చే పిచ్ లను తయారు చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి పిచ్ లపై బాలన్స్ సాధించడం కూడా కొన్నిసార్లు కష్టమే. ఇండియాలో మాత్రమే కాదు అంతట ఇదే జరుగుతుంది. అయితే పిచ్ లు ఎలా ఉన్నా దానిపై ఆడటం నేర్చుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవాలి. ఇండోర్ టెస్ట్ లో 60 నుంచి 70 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్ళం అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: