ఇటీవల ఐపీఎల్లో భాగంగా క్వాలిఫైర్ 2 లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు సార్లు ఛాంపియన్ అయినా ముంబై ఇండియన్స్ ను మట్టి కరిపించి చివరికి ఫైనల్ లో అడుగు పెట్టింది డిఫెండింగ్  ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టు. ఈ క్రమంలోనే రేపు ఫైనల్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో టైటిల్ కోసం పోరును కొనసాగించబోతుంది అని చెప్పాలి.


అయితే ఇటీవల జరిగిన రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు విజయం సాధించడానికి కారణం ఎవరు అని అడిగితే శుభమన్ గిల్ అని చెబుతారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే అతను మెరుపు సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఏకంగా 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. అందుకే అతనే కారణం అని చెబుతారు క్రికెట్ ప్రేక్షకులు. కానీ గిల్ మాయలో పడి బౌలింగ్లో సత్తా చాటి.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగాన్ని పేక మేడలా కూల్చేసిన మోహిత్ శర్మ గురించి మాత్రం చాలా మంది చర్చించుకోవట్లేదు. ఇలా గుజరాత్ గెలవడంలో గిల్ సెంచరీ తో పాటు మోహిత్ శర్మ కూడా తన బౌలింగ్ తో  కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. హాఫ్ సెంచరీ చేసి జోరు మీదే ఉన్నా సూర్య కుమార్ యాదవ్ను.. బౌల్డ్ చేసి మ్యాచ్ ను గుజరాత్ వైపుకు తిప్పాడు మోహిత్ శర్మ. ఆ తర్వాత విష్ణు వినోద్, జోర్దాన్, పియూస్ చావ్లా, కార్తికేయలను అవుట్ చేశాడు. కేవలం 2.2 ఓవర్లలోనే 10 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు సాధించాడు అని చెప్పాలి. ఇలా తన బౌలింగ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేసి.. ఇక విజయ అవకాశాలను గుజరాత్ వైపు మర్లేలా చేశాడు. ఇక ఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమ గణాంకాలు కూడా నమోదు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl