మన భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహణానికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది .. అంతేకాకుండా సూర్యగ్రహణం ఎంతో ముఖ్యమైన ఖగోళ సంఘటనగా అందరూ చూస్తున్నారు .. అదే విధంగ దీనిపై మతపరమైన దృక్కోణం నుంచి చూస్తే శుభప్రదంగా చూడరు .. సూర్యగ్రహణం సమయంలో ఎటువంటి శుభ లేదా మంగళకరమైన పనులు చేయరు .  అలాగే వీటితో పాటు సూర్యగ్రహణం సమయంలో  భోజనం చేయడం , వంట చేయటం నిద్రపోవటం కూడా నిషేధించబడింది .. అయితే ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలు సంభవించాల్సి ఉన్నాయి .. ఇక వాటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి .. ఇక ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఇప్పటికే వచ్చేసింది ..  ఇదే క్రమంలో ఈ సంవత్సరం 2025లో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది? ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఈ సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయకూడదు అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం .


ఇక ఈ 2025వ సంవత్సరంలో రెండవ చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 2025న రానుంది .. ఇక మన భారతీయ కాలచక్రం ప్రకారం ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 రాత్రి 11 గంటలకు మొదలవుతుంది .. అదే సమయంలో ఈ గ్రహణం సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3గంటల 24 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరం రెండవ చివరి సూర్యగ్రహణం భారతదేశంలో అసలు కనిపించదు .  దీని కారణంగా సూర్యగ్రహణ సూత కాలం భారతదేశంలో ఉండదు .. అయితే ఈ సూర్యగ్రహణం అమెరికా, ఆస్ట్రేలియా, ఫిజి, న్యూజిలాండ్ , అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది .



సూర్యగ్రహణం సమయంలో ఏ పనులు చేయకూడదంటే...

సూర్యగ్రహణం సమయంలో పూజలు చేయడం నిషిద్ధం.

గ్రహణ కాలం ప్రారంభమైన వెంటనే తులసి దళాలను ఆహార పదార్థాలలో వేయాలి

సూర్యగ్రహణం సమయంలో దేవుళ్ల విగ్రహాలను తాకకూడదు.

సూర్యగ్రహణ సమయంలో నిద్రపోకూడదు లేదా ఏమీ తినకూడదు.

సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు.

గ్రహణ సమయంలో కత్తెరలు, కత్తులు, సూదులు వంటి వస్తువులను ఉపయోగించరాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: