
అయితే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో సాధారణంగా ఆటగాళ్ల మధ్య కొన్ని సరదా సంఘటనలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా బౌండరీ లైన్ వద్ద నుండి డైరెక్ట్ త్రో విసిరిన అక్షర పటేల్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మ్యాక్స్వెల్ ను పెవిలియన్ పంపించాడు అని చెప్పాలి. అయితే ఈ రన్ అవుట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే మరోసారి అటు దినేష్ కార్తీక్ పై రోహిత్ శర్మ ఫైర్ అయ్యాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో చాహల్ వేసిన ఎనిమిదవ ఓవర్లో మ్యాక్స్వెల్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. ఈ క్రమంలోనే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న అక్షర పటేల్ బంతిని అందుకున్నాడు. వెంటనే స్ట్రైక్ ఎండ్ వైపు త్రో చేశాడు అని చెప్పాలి. ఎవరు ఊహించని విధంగా బంతి నేరుగా వికెట్లను తాకింది. అయితే వెంటనే భారత ఫీల్డర్లు రన్ అవుట్ అప్పీల్ చేయగా ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేశాడు. అయితే బంతి వికెట్లకు తాకడానికి ముందే వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సైతం తన గ్లౌజ్ తాగించడంతో బెయిల్ పైకి లేచింది. ఇక బంతి తాగిన తర్వాత రెండో బెయిల్ కూడా పైనకు లేచింది. దీని పరిగణలోకి తీసుకొని ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు. ఇక దినేష్ కార్తీక్ గ్లౌస్ తాకడం రిప్లై లో చూసిన రోహిత్ సీరియస్గా చూశాడు. కానీ ఎంపైర్ అవుట్ ఇవ్వడంతో చివరికి దినేష్ కార్తీక్ హెల్మెట్ కు ముద్దు పెట్టాడు.