అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు. అయితే జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం కూడా లేదు అనే త్రివిక్రమ్ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ కూడా ఇలాంటి ఒక అద్భుతమే జరిగింది అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇది జరిగినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం నిజంగానే ఐపీఎల్ హిస్టరీ లో ఇదొక అద్భుతం అంటూ అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇలాంటి ఘటన ఐపీఎల్లో జరగలేదు అనడంలో సందేహం లేదు.



 ఇటీవలే ఐపిఎల్ సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అనట్లుగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్ తో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్  జట్టు తరఫున ఆడుతున్న ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ సంచలనమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 39 బంతుల్లోనే ఏడు సిక్సర్లు 5 ఫోర్ లతో 81 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒక రకంగా గుజరాత్ జట్టుకు చుక్కలు చూపించాడు అని చెప్పాలి. అయితే ఎంతో దూకుడుగా ఆడుతున్న గుర్బాజ్ ను అవుట్ చేయడానికి గుజరాత్ బౌలర్లు తంటాలు పడ్డారు.


 కానీ ఎంతో దూకుడుగా ఆడుతున్న గుర్బాజ్ ను ఎట్టకేలకు నూర్ అహ్మద్ వికెట్ పడగొట్టి అవుట్ చేయగలిగాడు. ఇన్నింగ్స్ 16 ఓవర్లో రెండో బంతిని గుర్బాజ్ డీప్ మీట్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడెందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ ఖాన్ చేతుల్లోకి నేరుగా బంతి వెళ్ళింది. రషీద్ ఖాన్ ఎంత గొప్ప ఫిల్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఎలాంటి తప్పిదం చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే.. బ్యాటింగ్ ఆడిన రహమనుల్లా గుర్బాజ్.. బౌలింగ్ వేసిన నూర్ అహ్మద్.. క్యాచ్ పట్టిన రషీద్ ఖాన్ ముగ్గురు కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన ఆటగాళ్లే. ఇప్పుడు ఆ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. నిజంగా ఐపీఎల్లో ఇది ఒక అద్భుతం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl