జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా బ్రాండ్ కి భారత మార్కెట్లో ఎంత మంచి డిమాండ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ కంపెనీ ఇండియా మార్కెట్లోకి మరొక సరికొత్త ప్రీమియం మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇటీవలే కొత్త yamaha mt-15 Monster Energy Moto GP Edition (ఎమ్‌టి-15 మోన్‌స్టర్ ఎనర్జీ మోటో జిపి ఎడిషన్‌)ను విడుదల చేసిన కంపెనీ ఇక ఇప్పుడు కొత్తగా Yamaha YZF R15M బైక్ ని విడుదల చేయబోతోంది.ఇక ఈ కొత్త మోడల్ బైక్ విడుదల కావడానికి ప్రారంభానికి ముందే దీని ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యి తెగ వైరల్ అయ్యాయి. ఇక యమహా మోటార్ ఇండియా తమ డీలర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో Yamaha R15 కొత్త 'M' వెర్షన్ కంపెనీ ప్రదర్శించడం జరిగింది.ఇక ఈ ఈవెంట్‌లో, కంపెనీ తన రాబోయే Yamaha R15M మోడల్ ని డీలర్ల ముందు ఉంచడం జరిగింది.ఇక ఇంటర్నెట్‌లో లీకైన చిత్రాల ద్వారా కొత్త Yamaha YZF R15M లో చేసిన కొన్ని కీలమార్పులు వెల్లడవ్వడం జరిగింది.

 ఇక స్టాండర్డ్ YZF R15 తో ఈ బైక్ ని పోల్చుకుంటే.. ఈ కొత్త బైక్‌లో అనేక కాస్మెటిక్ మార్పులు అనేవి చేయబడ్డాయి. ఇక ఇందులో ప్రధానమైన మార్పు అనేది దాని హైడ్‌లైట్ రూపంలో ఉంటుంది.ఇక ఇదే మార్పు ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఇక సాధారణంగా ఈ స్టాండర్డ్ Yamaha R15 బైక్ మోడల్‌లో కనిపించే ట్విన్-ఐ హెడ్‌లైట్ స్థానంలో కొత్త సింగిల్-పాడ్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ యూనిట్ ను ఈ కొత్త Yamaha R15M మోడల్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది చూడటానికి yamaha mt-15 ఇంకా Yamaha FZX-25 మోడళ్లని గుర్తుకు తెచ్చేలా ఉంటుంది.ఇక అంతేకాకుండా, ఈ కొత్త Yamaha YZF R15M బైక్ లో బైక్ ప్రియులను దృష్టిని ఆకర్షించే మరో విషయం ఏమిటంటే ఈ బైక్ ముందు భాగంలో బంగారం కలర్ లో పెయింట్ చేయబడిన కొత్త USD (అప్-సైడ్ డౌన్ ఫోర్కులు).ఇక తలక్రిందులగా అమర్చబడిన ఈ ఫ్రంట్ ఫోర్కులు కొత్త బైక్‌కు ఆకట్టుకునే స్పోర్టీ రూపాన్ని ఇవ్వటమే కాకుండా ఇంకా బైక్ నిర్వహణను కూడా ఎంతగానో మెరుగుపరుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: