ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్ కార్డు కూడా అంతే అవసరం.ఈ రోజుల్లో ఈ రెండు కూడా రెండు కళ్ళ లాంటివని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఇక తప్పనిసరిగా ఈ రెండింటిని కూడా లింక్ చేసుకోవాలి. ఇక పాన్ కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయడానికి గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పుడు గడువు సెప్టెంబర్ 30, 2021 నుండి మార్చి 31, 2022 వరకు పొడిగించబడటం జరిగింది. అలాగే ఆదాయపు పన్ను చట్టం కింద పెనాల్టీ ప్రక్రియ పూర్తయ్యే తేదీని సెప్టెంబర్ 30, 2021 నుండి మార్చి 31, 2022 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక ఇంతకుముందు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ రూల్ 114AA ని నోటిఫై చేయడం జరిగింది, పేర్కొన్న తేదీకి లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయకపోవచ్చని పేర్కొనడం జరిగింది.

ఇక నియమం ప్రకారం, పాన్ కార్డు పనిచేయని పక్షంలో, అతను పాన్ కార్డుని ని అందించలేదని, తెలియజేయలేదని లేదా ఉల్లేఖించలేదని భావించవచ్చు, ఒకవేళ కేసు ప్రకారం, అతను అందించిన, తెలియజేయకుండా చట్టం కింద అన్ని పరిణామాలకు బాధ్యత వహించాలి , లేదా పాన్ ని కోట్ చేయడం చెయ్యాలి.తన ఆధార్‌ కార్డును డిపార్ట్‌మెంట్‌కు తెలియజేసిన తర్వాత పాన్ కార్డు తిరిగి యాక్టివేట్ చేయవచ్చని గమనించాలి. అయితే, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఇచ్చిన గడువుకు ముందు వారి ఆధార్‌ కార్డుని తప్పనిసరిగా పాన్‌ కార్డుతో లింక్ చేయాలి. మీ పాన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేయడానికి, ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి, నిమిషాల్లో ప్రక్రియను పూర్తి చేయవచ్చు.ITR దాఖలు చేయడానికి, ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వకపోతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ని లింక్ చేయడం తప్పనిసరి అని I-T శాఖ తెలిపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: