మైక్రో ఓవెన్ ద్వారా ఆహార పదార్ధాలని వేడి చేసుకొని తినవచ్చు. ఇంకా కేకులు ఇంకా బిస్కెట్లు వంటివాటిని కూడా తయారు చేసుకొని తినవచ్చు. కానీ ఈ మైక్రో ఓవెన్ వాడే ముందు ఖచ్చితంగా కొన్ని రకాల విషయాలు తెలుసుకోవాలి. అయితే దీనిలో ఏ పదార్థాలను వేడి చేయాలి..? వేటిని చేయకూడదనే వంటి వివరాలను ముందుగానే తెలుసుకొని ఉపయోగించాలి. ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలను మైక్రో ఓవెన్‌లో పెట్టడం వల్ల అది ఖచ్చితంగా పేలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దీన్ని వాడేవారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మైక్రో ఓవెన్‌లో ఏయే పదార్థాలను వేడి చేయకూడదో  ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..మనలో చాలామంది కూడా నీటిని మైక్రోఓవెన్‌లోనే వేడి చేస్తారు. అయితే ఆ నీటిని వేడి చేసే సమయంలో బుడగలు ఏర్పడతాయి. ఈ బుడగలు ఖచ్చితంగా ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంది. ఈ నీటి బుడగలు పేలడం వల్ల ఒక్కొక్కసారి ఓవెన్ పేలే ప్రమాదం కూడా ఉంది.


ఒకవేళ నీటిని వేడి చేయాలి అనుకుంటే చాలా తక్కువ సమయంలోనే మీరు వాటిని బయటికి తీసేయాలి. 30 సెకన్ల కన్నా ఎక్కువ సమయం నీటిని ఓవెన్లో లోపల అస్సలు ఉంచకూడదు.ఇంకా అలాగే టమోటో సాస్‌ను చాలా మంది ఓవెన్లో వేడి చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు.ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదకరం. టమోటో సాస్ వేడెక్కాలంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. అయితే ఆ ఉష్ణోగ్రతకు ఓవెన్ చేరుకున్నాక ఆవిరి చాలా ఎక్కువగా మారుతుంది. దీనివల్ల దానిలో ఖచ్చితంగా పేలుడు సంభవించవచ్చు.ఇంకా అలాగే ఉడికించిన గుడ్లు లేదా రిఫ్రిజిరేటర్లో ఉంచి అప్పుడే తీసిన గుడ్లను మైక్రో ఓవెన్‌లో ఉంచడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మనం గుడ్డు పెంకులతో సహా ఓవెన్లో పెట్టడం వల్ల లోపల అవి పేలి, విద్యుత్ ప్రమాదాలకు ఖచ్చితంగా కారణం కాగలవు. అయితే ఉడికించిన గుడ్లను పెంకు తీసేసిన తర్వాత అవి చల్లగా అయ్యాక వేడి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ పెంకులతో పాటు గుడ్డును లోపల అస్సలు పెట్టకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: