సాధారణంగా బంగారం ధరించాలని ఎవరికి ఉండదు చెప్పండి. కేవలం డబ్బున్న వాళ్ళకే కాదు డబ్బు లేని వాళ్ళు కూడా కాస్తో కూస్తో బంగారం ధరించడానికి ఆసక్తి చూపుతుంటారు  డబ్బున్నవాళ్ళు అయితే ఒంటి నిండా బంగారం ఉండేలా చూసుకుంటారు.  అయితే చాలా మటుకు మహిళలే ఎక్కువగా బంగారాన్ని ధరించడానికి ఆసక్తి చూపుతూ ఉండటం చూస్తూ ఉంటాం. ఇక పురుషులు తక్కువగానే బంగారాన్ని ధరించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇక ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారాన్ని ధరించి అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు అన్నది తెలిసిందే.



 అయితే ఇప్పటివరకు ఇలా ఒంటినిండా ఏకంగా కేజీలకు కేజీలు బంగారం ధరించిన వారిని చూసే ఉంటారు. ఇలాంటి వారు చాలా సార్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. కానీ కేవలం ఒంటి మీద కాదు ఇక ఇంట్లో కూడా బంగారం ఉంటుందా అంటే.. ఇక బాగా డబ్బున్న వాళ్ళు ఇంట్లో ప్లేట్లు గ్లాసులు పలురకాల విగ్రహాలను కూడా బంగారంతో చేయించుకుంటూ వుంటారు. ఇలాంటివి అప్పుడప్పుడు నిజ జీవితంలో ఎక్కువసార్లు సినిమాలలో చూస్తూ ఉంటాం.  కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం బంగారాన్ని అంతకుమించి అనే రేంజ్లో వాడేసాడు.



 ఒంటినిండా బంగారం చేసుకోవడమే కాదు  ఇంట్లోనే ప్లేట్లు గ్లాసులు బంగారం చేయడమే కాదు ఇంట్లో ప్రతి వస్తువుతో కూడా బంగారం చేయించాడు. రష్యాలోని ట్రాఫిక్ వ్యవస్థ విభాగంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో 35 మందికి పైగా అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు  తెలుస్తుంది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా కల్నాల్ అలెక్సీ అనే ఉన్నతాధికారి ఇంట్లో దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. ఇక ఇంట్లోకి వెళ్లి ఒక్కసారిగా షాకయ్యారు. ఇంట్లో కి వెళ్తే ఫర్నిచర్ ఫోటోలు చివరికి బాత్రూంలో కూడా పూర్తిగా బంగారంతో తయారుచేసినవే ఉన్నాయ్. ఇక ఇవి చూసినా  అధికారులు అవాక్కావ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: