ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువతీ యువకులు.. తమ అనుకున్న కల నెరవేర్చుకునేందుకు తమ వంతు సహాయంగా కృషి చేస్తూనే ఉన్నారు.. అలా కృషి చేస్తున్న సమయంలోనే ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక మరికొందరు అయితే ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకునే వారిని చూశాము. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఘోరమైన దుర్ఘటన జరిగింది వాటి సంబంధించి మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం.


అసలు విషయంలోకి వెళ్తే ..తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ జిల్లాలో ఒక గోరమైన సంఘటన చోటు చేసుకుంది.. ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఒక హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు మరణించారు ఈ ఘటన పెద్దాపురం మండలం తుంగతుర్తి లో దగ్గర ఉన్న రామన్నగూడెం వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. శిక్షణ ఇస్తున్న ఒక ట్రైనింగ్ హెలికాఫ్టర్ క్రాస్ అయ్యి ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ హెలికాప్టర్ నుంచి దట్టమైన మంటలు వ్యాపించాయి.


ఇలా శిక్షణ ఇచ్చే టువంటి హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో  అక్కడికక్కడే ఆ హెలికాఫ్టర్ తునాతునకలు అయింది.. ఇక ఈ ప్రమాదంలో మహిళా పైలెట్ తో సహా ట్రైనింగ్ పైలెట్లు ఉన్నట్లు సమాచారం. అయితే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. అక్కడికి వెంటనే రెవెన్యూ, వైద్య అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ స్తంభం మీద హెలికాప్టర్ కూలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని అక్కడ ఉండే కొంతమంది స్థానికులు తెలియజేయడం జరిగింది.. అయితే ఇందులో ఎంత మంది ప్రయాణించారు వారు ఎక్కడ నివసిస్తున్నారు అనే విషయాలను ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.


ఇక అక్కడి స్థానికులు తెలిపిన ప్రకారం ఒక పెద్ద శబ్దం రావడంతో వారు హుటాహుటిన అక్కడికి వెళ్లి చూసేసరికి ఈ విమానం కుప్పకూలిపోయి ఉన్నదట. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఇందులో ఒక పైలట్, ట్రైనింగ్ పైలట్ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ట్రైన్ విమానానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: