తెలంగాణలో ఉండే ఎన్నో పుణ్యక్షేత్రాలలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయంలోకి ఎంతోమంది భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి దేవుడిని దర్శించుకుంటూ వుంటారు. అయితే ఇప్పుడు ఆలయ దర్శనం ఈనెల 28వ తేదీ నుంచి కలగనుంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లుగా సమాచారం. ఈ నెల 28వ తేది ఉదయం 11 గంటల 55 నిమిషాల సమయం నుండి మహా కుంభ సంప్రోక్షణ తో ప్రారంభం కానుంది. ఇక ఈ యాద్రాద్రి మహా కుంభ అయిపోయిన వెంటనే అనే మూలవిరాట్ దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందట. ఈ విషయాన్ని ఆలయ EO గీతారెడ్డి తెలియజేయడం జరిగింది.

మహా కుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉండబోతున్నాయని తెలియజేశారు. స్వామిని ఊరేగిస్తూ ఉత్సవ ముహూర్తాల లోనే శోభయాత్ర గా ఆ స్వామిని ప్రధాన ఆలయంలో కి తరలించడం జరుగుతుందట. అయితే పూజ సమయంలో మాత్రం భక్తులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత భక్తులందరికీ దర్శనానికి అనుమతి ఇస్తామని తెలియజేశారు. ఇక ఈనెల 28వ తేదీన ఈ మహా కుంభంలో సీ.ఎం కేసీఆర్ కూడా పాల్గొనబోతున్నారు.

ఇక ఈ నెల 21వ తేదీ నుంచి మొదలు ఏడు రోజుల పాటు బాలాలయంలో పంచకుండాత్మక యాగం నిర్వహించబోతున్న ట్లుగా ఆలయ EO గీతారెడ్డి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 108 పారాయణదారులు, ఆలయ అర్చక బృందం తో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాదాద్రి ఆలయ గోపురాలు కళాశాలలకు సంబంధించిన వాటిని పూర్తి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలియజేశారు. ఇక స్వామివారికి కైంకర్యాలు సజావుగా జరిగే విధంగా అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నట్లు గా తెలియజేయడం జరిగింది. లక్ష్మీ నరసింహ స్వామి కి దర్శించుకునే భక్తుల కోసం ఒక జియో ట్యాగింగ్ కూడా ఉపయోగించబడుతుంది నట్లుగా ఆలయ EO గీతారెడ్డి తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: