ఈ భూమి మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో మొసళ్ళు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అడవికి రారాజు సింహం అయినా ఆ సింహాన్ని ఆహారంగా మార్చుకునే బలాన్ని నీటిలో ఉన్నప్పుడు మొసలి కలిగి ఉంటుంది. అందుకే సింహం సైతం మొసలి జోలికి వెళ్ళాలి అంటే జంకుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. పైనకి ఎంతో ప్రశాంతంగా కామ్ గా కనిపించే మొసళ్లు వేటాడటం మొదలు పెడితే ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది మాత్రం తలుచుకోవడానికే వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అయితే మొసలి ఎంత దారుణంగా వేటాడుతుంది అనే దానికి సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి.


 ఈ క్రమంలోనే జంతువులు మాత్రమే కాదు ఏకంగా మనుషులు కూడా మొసళ్ల దగ్గరికి వెళ్లాలి అంటే భయపడిపోతూ ఉంటారు  కానీ కొంతమంది మాత్రం ఏకంగా ప్రమాదకరమైన మొసళ్లతోనే ఆటలు ఆడుతూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి అంటే చాలు ఎంతోమంది నేటిజన్స్ ఆ పిచ్చి పనులు చేసిన వారిని తిట్టిపోవడం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నాడేమో అన్న రీతిలో మొసలితో ఆటలు ఆడుతున్నాడు.


 ముసలి ఉన్న చోటుకు వెళ్తేనే ప్రమాదం. అలాంటిది మొసలి ముందుకు వెళ్లి నిలబడితే ఇంకేమైనా ఉందా ప్రాణం పోయినట్లే. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ఒక భారీ మొసలి ముందుకు వెళ్లి ధైర్యంగా నిలబడ్డాడు. ఏకంగా నోట్లో మాంసం ముక్క పెట్టుకుని నోటితో మొసలి నోటికి అందించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక మొసలి కూడా మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నిస్తే అతను ఒక అడుగు వెనక్కి వేసి ఆటపట్టించడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. అయితే ఏ మాత్రం తేడా జరిగిన మాంసం ముక్క బదులు అతనే మొసలికి ఆహారంగా మారుతాడు. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: