కావలసిన పదార్ధాలు: పనీర్ - రెండు కప్పులు బాస్మతి బియ్యం - రెండు కప్పులు క్యాప్సికమ్ - ఒకటి పచ్చిబఠాణి - అర కప్పు కొబ్బరి తురుము - చిన్న కప్పు క్యారట్ తురుము - చిన్న కప్పు ఉల్లికాడల తురుము - చిన్న కప్పు జీడిపప్పు - 10 చిల్లీ సాస్ - 1 టీ స్పూన్ టొమాటో సాస్ - 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్ గరం మసాలా పొడి - అర టీ స్పూన్ మిరియాల పొడి - అర టీ స్పూన్ ఉప్పు - రుచికి సరిపడా అజినోమాటో - చిటికెడు నూనె - 50 గ్రాములు తయారు చేయు విధానం :ముందుగా బాస్మతి బియ్యం కడిగి కాస్త పలుకుగా(పొడిపొడిగా) వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పనీర్ ను అంగుళం ముక్కలుగా కోసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి బౌల్ లోకి తీసుకున్న పనీర్ ను ముక్కలను, జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మరలా కొద్దిగా నూనె వేసి అది వేడెక్కా అల్లం వెల్లుల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఉల్లికాడల తురుము, క్యాప్సికమ్, పచ్చిబఠానీలు, క్యారట్ తురుము వేసి కొంచెం చేపు వేయించాలి. ఆ తర్వాత చిల్లీసాస్, టోమాటో సాస్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా వేపాలి. ఇప్పుడు అందులోనే వేయించి పెట్టుకొన్న పనీర్, జీడిపప్పు ముక్కలు, అజినోమాటో, వండిన అన్నం వేసి అన్నీ బాగా కలిసేలా కలబెట్టాలి. చివరగా తరిగిన కొత్తిమిర, తురిమిన కొబ్బరి కూడా చల్లి ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. అంతే నోరూరించే ఫన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: