ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....రైడర్లకి బాగా ఇష్టమైన కంపెనీ కవాసాకి కంపెనీ. ఈ బైక్స్ అంటే చాలు యూత్ పిచ్చెక్కిపోతారు.రేసింగ్ బైక్ లలో వీటి స్థాయి కాని స్థానం కాని వేరు. బైక్ లవర్స్ కి కవాసాకి బైక్స్ అంటే ఓ ఎమోషన్ అనే చెప్పాలి.తాజాగా కవాసాకి  సరికొత్త సూపర్ బైక్స్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవే కవాసాకి జెడ్ హెచ్ 2 ,జెడ్ హెచ్2 ఎస్ఈ ఎస్ఈ బైక్స్.కవాసాకి జెడ్ హెచ్ 2  బైక్ ప్రారంభ ధర వచ్చేసి రూ.21.90 లక్షలు కాగా.. జెడ్ హెచ్2 ఎస్ఈ మోటార్ సైకిల్ ఖరీదు రూ.25.90 లక్షలుగా సంస్థ వెల్లడించింది.ఈ 2021 కవాసాకి జెడ్ హెచ్2, జెడ్ హెచ్2 ఎస్ఈ మోటార్ సైకిళ్లు 998 సీసీ సింగిల్ సిలీండర్ సూపర్ ఛార్జెడ్ ఇంజిన్ ను కలిగి ఉండి 11000 ఆర్పీఎం వద్ద 200 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 8700 ఆర్పీఎం వద్ద 137 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

అంతేకాకుండా 6-స్పీడ్ గేర్ బాక్స్ అసిస్ట్ క్లచ్ తో పనిచేస్తుంది. సస్పెన్షన్ దగ్గరకొస్తే ముందు భాగంలో ఫుల్లీ అడ్జస్టబుల్ ఇన్వర్టెడె ఫోర్కులు, వెనక భాగంలో మోనో షాక్ సెటప్ ను కలిగి ఉన్నాయి. 320 ఎంఎం డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 260 ఎంఎం సింగిల్ రియర్ డిస్క్ బ్రేక్ తో పాటు డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ తో పనిచేస్తాయి.17- అంగుళాల వీల్స్ తో 120/70 ఫ్రంట్ ప్రొఫైల్, 190/55 రియర్ ప్రొఫైల్ ను కలిగి ఉన్నాయి. కవాసాకి, జెడ్ హెచ్2 ఎస్ఈ 240 కేజీల బరువుండి జెడ్ హెచ్2 కంటే కేజీ బరువు తక్కువ ఉంది. ఈ రెండు మోటార్ సైకిళ్లు సింగిల్ కలర్ అయిన మెటాలిక్ డియోబో బ్లాక్-గోల్డెన్ బ్లాజెడ్ గ్రీన్ కలర్ లో దొరుకుతాయట.కవాసాకి జెడ్ హెచ్2, జెడ్ హెచ్2 ఎస్ఈ మోటార్ సైకిళ్లలో ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫుల్ కలర్ టీఎఫ్టీ ఎల్సీడీ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ తో పాటు బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకునేందుకు కవాసాకి రేడియోలాజీ యాప్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫ్యాట్ టైప్ హ్యాండిల్ బార్ ను కలిగి ఉన్న ఈ బైక్స్ ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ తో పాటు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇవి సుగోమీ డిజైన్ లాంగ్వేజితో రూపొందించారు. మినిమాలిస్టిక్ స్టైలిష్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ బైక్స్ అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్ అసిమిట్రిక్ ర్యామ్ ఎయిర్ ఇన్టేక్ తో ఆకట్టుకుంటున్నాయి. సూపర్ ఛార్జెడ్ ఇంజిన్ ను వీటిలో పొందుపరిచారు.ఇక ఇలాంటి మరెన్నో ఆటోమొబైల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: