టాటా మోటార్స్ రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ టియాగో ఈవి లాంచ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే లాంచ్ చేసినా కూడా కంపెనీ బుకింగ్స్ గురించి గానీ, బుకింగ్ ప్రైస్ గురించి గానీ, టెస్ట్ డ్రైవ్స్ గురించి గానీ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.అయితే కంపెనీ ఇప్పుడు ఆ వివరాలను అందించింది. అవేంటో తెలుసుకుందాం.కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త టాటా టియాగో ఈవి బుకింగ్స్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే బుకింగ్స్ రేపటి నుంచి స్వీకరించబడతాయి. ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జనవరి నుంచి స్టార్ట్ కానున్నాయి.ఇక ఈ ఎలక్ట్రిక్ కారు  టెస్ట్ డ్రైవ్స్ విషయానికి వస్తే, ఇండియన్ మార్కెట్లో టెస్ట్ డ్రైవ్స్ డిసెంబర్ చివరినాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.


కాబట్టి ఈ కారుని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకునే కస్టమర్లు ఈ డిసెంబర్ నెలలో టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు.ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన టాటా టియాగో ఈవి మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ ఇంకా XZ+ టెక్ లక్స్. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.ప్రస్తుతం టాటా కంపెనీ వెల్లడించిన ధరలు కేవలం 10,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ కారు కొనాలనుకులే కస్టమర్లు ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.అయితే ఇప్పటికే వెల్లడైన సమాచారం ప్రకారం, టాటా టియాగో టాప్ వేరియంట్ అయిన XZ+ టెక్ లక్స్ వేరియంట్ కొనడానికి కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఇప్పటికీ 500 కంటే ఎక్కువ అఫీషియల్ బుకింగ్స్ కూడా స్వీకరించినట్లు ముంబై డీలర్షిప్ వర్గాల ద్వారా తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: