ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా.. గవర్నర్ నుంచి ఏకంగా రాష్ట్రపతిగా ప్రమోషన్ ఇవ్వబోతున్నారా.. అంటే.. అవునంటున్నాయి కొన్ని రాజకీయ వర్గాలు.. ఈసారి మహిళలకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్టు సమాచారం.. అందులోనూ దక్షిణాది వ్యక్తికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట.

ఈ సమీకరణాల ప్రకారం రేసులో నిర్మలాసీతారామన్‌, తమిళిసై సౌందరరాజన్‌ ఉన్నారు. అందులోనూ నిర్మలా సీతారామన్‌ అగ్ర వర్ణం కావడంతో తమిళిసై సౌందరరాజన్‌కు ఆ ఛాన్స్ దక్క వచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే. బిహార్‌లో అధికారాన్ని బీజేపీచేతుల్లోకి తీసుకురావడానికి వీలుగా అక్కడి సీఎం నీతీశ్‌కుమార్‌కు రాష్ట్రపతి పదవి ఆఫర్ చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. మరి ఇందుకు నీతీశ్‌ ఏమంటారో తెలీదు. ఇప్పటి వరకూ రాష్ట్రపతి పదవి కోసం మాత్రం  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: