ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. వాటికి సమాధానం చెప్పకుండా సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన పోస్టలు పెడుతున్నారని.. ఐ-టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష  ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా ప్రతినిధులు ప్రతిపక్ష పార్టీ మహిళల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా మాధ్యమాల్లో....టీడీపీ మహిళా కార్యకర్తల గురించి అసభ్యంగా పోస్టులు పెడుతూ వారిని మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారని  ఉండవల్లి అనూష అన్నారు.


పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని.. అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అనూష మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అనుమతి లేకుండానే వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఇలా వ్యవహరిస్తున్నారా అని  ఉండవల్లి అనూష ప్రశ్నించారు. మహిళలను అక్కచెల్లెమ్మలుగా సంబోధించే జగన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ మహిళలు మహిళలుగా కనిపించడం లేదా అని  ఉండవల్లి అనూష ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: