ఏపీలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏపీలోని అన్ని 175 నియోజవర్గాలు 25 ఎంపి స్థానాల్లో బి అర్ యస్ అభ్యర్థులను నిలుపుతామని.. ఆంధ్రప్రదేశ్ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌ తెలిపారు. ఏపీలో భారీగా చేరికలు ఉండ బోతున్నాయని.. టిడిపి, వైసీపీలు ఏపికి అన్యాయం చేశాయని.. తోట చంద్రశేఖర్‌ తెలిపారు. ఏపిలో పెట్టుబడుల పేరుతో వైసీపీ కూడా మోసం చేసిందని.. పెట్టుబడి దారులకు నమ్మకం కలిగించడంలో ఎపిలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని తోట చంద్రశేఖర్‌ అన్నారు.

 
బిజెపి మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతుందన్న తోట చంద్రశేఖర్‌ .. ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థల్ని బిజెపి ప్రేరేపిస్తుందన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టెందుకు బీజేపి ప్రయత్నిస్తుందని.. బిజెపికి జాతీయ స్థాయిలో బీ అర్ యస్  ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతుందని తోట చంద్రశేఖర్‌  అన్నారు. అన్ని శక్తులను ఐక్యం చేసేందుకు కెసిఆర్ అడుగులు వేస్తున్నారని..ప్రతిపక్ష పార్టీలు దేశంలో  ఉండకూడదని  బిజెపి భావిస్తోందని తోట చంద్రశేఖర్‌  విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: