నాగార్జున సాగర్ వంి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా వివాదం పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ అంతా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇవాళ ఉదయం 11గం.లకు అత్యవసర సమావేశాన్ని జలశక్తి శాఖ  ఏర్పాటు చేసింది. జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ అత్యవసర సమావేశం జరగబోతోంది.


ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ డిజిలు, కేంద్ర జలసంఘం, కేఆర్ఎంబి చైర్మన్ లకు పిలుపు వచ్చింది. జలసంఘం, కేఆర్ఎంబి చైర్మన్ లు నేరుగా సమావేశానికి హాజరు కావాలని పిలుపు వచ్చింది. నాగార్జున సాగర్ వద్ద ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి వెంటనే కొలిక్కి తీసుకురావాల్సిన విషయం పైనే ప్రధానంగా అధికారులు చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: