ఆహా స్ట్రీమింగ్ లో వస్తున్న ఎపిసోడ్లు రాజకీయంగా మారిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆహాలో అన్ స్టాపబుల్ 2 లో గెస్ట్ గా వచ్చని విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అల్లు అరవింద్ మరొక ప్రోమోను విడుదల చేశారు. పవన్ తో బాలకృష్ణ చేసిన రెండో ఎపిసోడ్ లో అడిగిన ప్రశ్నను ప్రోమోగా బయటకు వదిలారు. అది ఒక సంచలన ప్రశ్న పవన్ మీరు టీడీపీలో చేరొచ్చుగా అని.. ఇలాంటి ప్రశ్నలను అడిగి దాన్ని బయటకు వదిలి బయట పవన్ ను నమ్ముకున్న కార్యకర్తల్ని, ప్రజల్ని అయోమయానికి గురి చేయాలనుకుంటున్నారు.


బాలయ్యకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఆయన గతంలో మా రక్తం వేరు, మా వంశం వేరు, వేరే వారు మాకెవరు సాటి రారు సినిమా రంగంలో కానీ, రాజకీయంగా కానీ అని వివాదాన్ని రేకెత్తించారు. మొన్న ఈ మధ్య అమెరికాలో బాలకృష్ణ అభిమానులు, పవన్ అభిమానులు విపరీతంగా కొట్టుకున్నారు. ఇదంతా జరిగినా పవన్ బాలయ్య చేస్తున్న షోకి వెళ్లడం చాలా మంది అభిమానులు, కార్యకర్తలకు నచ్చలేదు. పవన్ వెళ్లినా జనసేనకు ఏమైనా లాభం చేకూరిందా అంటే అది లేదు.


టీడీపీకి సంబంధించి చేరొచ్చుగా, పొత్తు పెట్టుకుంటారా లేదా? అనే ప్రశ్నలు వచ్చాయి. దీనికి ఎలాగో పవన్ నేను స్వతంత్రంగా ఉండే మనిషిని అంటూ సమాధానం చెబుతారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే జనాల్లోకి వెళ్లి వారి నమ్మకాన్ని చూరగొనాలని భావిస్తున్న తరుణంలో ఇలాంటి షో చేయడం వల్ల టీడీపీ కి చెందిన వ్యక్తి చంద్రబాబు బావమరిది అయినా బాలకృష్ణతో కలిసి మాట్లాడటం చాలా మందికి నచ్చడం లేదు. ప్రస్తుతం తెలుగుదేశం మనిషి అనే ముద్ర పవన్ కు నీట్ గా పడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ షోతో పవన్ ఇమేజ్ ఏమైనా పెరుగుతుందా టీడీపీకి కలిసొస్తుందా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

NBK