వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ డోస్ అయినట్లు కనిపిస్తోంది. జగన్ దగ్గర ఇప్పటికే లిస్ట్ రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న 45 మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం లేదని జోరుగా చర్చ నడుస్తోంది. అయితే దీని వల్ల వైసీపీకి లాభం చేకూరుతుందా? నష్టం కలిగిస్తుందా.. అనేది ఎన్నికల ఫలితాల తర్వాతనే తెలుస్తుంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఇప్పటికే తమ దారి తాము చూసుకుంటున్నారు.


నెల్లూరులో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పార్టీని వీడారు. ఆ నియోజకవర్గంలో మరొక నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.  మరో నియోజకవర్గంలో ఆనంకు బదులుగా నేదురుమల్లి ఉన్నారు. మేకపాటి కి కూడా జగన్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారనే విషయం ఆయనకు తెలిసింది. దీంతో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చేరారు.


ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎంతమందికి గుండెపోటు వస్తుంది. టికెట్ రాదన్న మరుక్షణం వారు ఎలా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో మూడు ముక్కలాట కొనసాగుతోంది. వైసీపీ,టీడీపీల మధ్య అసలైన పోరాటం ఉంటే జనసేన కూడా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో వైసీపీ గెలవాలంటే గట్టిగా పోరాటం చేయాల్సిందే.


ఒకప్పుడు ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్తుతం  లేవు. ఒక పార్టీ కాకపోతే మరో పార్టీ అని జంపింగ్ చేయడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నారు. చివర్లో జనాభా ఎక్కువయితే కూడా ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారుతుంది. పొత్తులు పెట్టుకున్న పార్టీల్లో టిక్కెట్లు ఎవరికీ కేటాయించాలో తెలియక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ముందుగానే సీఎం జగన్ వైసీపీలో దాదాపు నేతల లిస్ట్ రెడీ చేసేశారు. మరి ఎవరికి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది.. ఎవరికి రాదనే విషయం త్వరలోనే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: