కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న వారు నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ తో పాటు శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్  నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని చెప్పేశారు. ఇందులో శరద్ పవార్ ముందు నుంచి బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే వారే.


నితీశ్ కుమార్ ఈ మధ్య బీజేపీతో తెగ దెంపులు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ మిత్ర పక్షంగా లేని బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఆప్, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు సైతం ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని చెప్పేశాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి వెళతారని ప్రకటించారు.


2019 ఎన్నికల సమయంలో బీజేపీతో తెగ దెంపులు చేసుకున్న చంద్రబాబు అప్పట్లో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లారు. దీని వల్ల రాష్ట్రంలో ఆయనపై  తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.  ఈ కార్యక్రమం అనేది పార్టీలకతీతంగా జరుగుతున్న మాట వాస్తవమే.  కానీ చంద్రబాబు నాయుడు ఇప్పడు కాంగ్రెస్ తో కలిసి ఉన్నారా? బీజేపీతో పొత్తుకు సిద్ధపడుతున్నారా అనే అంశంపై డోలాయమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీకి మద్దతు మొదటి నుంచే ఇచ్చినట్లు తెలుస్తోంది.


వైఎస్సార్ ఎంపీలు మొత్తం 22 మంది ఉంటే రఘు రామ కృష్ణంరాజు మాత్రం వైసీపీ కి దూరంగా ఉంటున్న మాట తెలిసిన విషయమే. టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు కార్యక్రమానికి హాజరైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ ఎంపీలు వెళుతున్నట్లే. పార్లమెంటు ప్రారంభోత్సవానికి  దేశంలో ఆంధ్ర నుంచే మొత్తం మంది ఎంపీలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: