రఘురామ కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ అధినేత జగన్ తో పడక ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం టీడీపీ నుంచి ఎంపీ పదవికీ పోటీ చేస్తాడనే ప్రచారం ఉంది. నాగబాబు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ను రఘు రామ విమర్శించినంత రాష్ట్రంలో ఎవరూ విమర్శించడం లేదు. ఆఖరుకు టీడీపీ కూడా జగన్ ను విమర్శించడంలో రఘురామ తర్వాతనే ఇతరులు అనేది తెలుస్తోంది.


తెలుగుదేశం విజయం సాధించడం అనేది రఘురామకు చాలా ఇష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, టీడీపీ గెలిస్తేనే రఘురామ కృష్ణంరాజు నరసాపురం సగర్వంగా రాగలడు. ఇప్పటికీ జగన్ కొట్టిన దెబ్బకు సొంత నియోజకవర్గానికి రాలేక హైదరాబాద్ ఢిల్లీలోనే గడపుతున్నారు. ఇలాంటి సందర్భంలో అందరి కంటే ఎక్కువగా టీడీపీ లబ్ధి పొందితే ఆనందపడేది రఘురామనే. ఎలాగైనా సరే నరసాపురంలో ఎంపీగా గెలిచి తిరిగి సొంత నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చూస్తుండగా రావాలనేది రఘు రామ కోరిక.


అయితే దీని కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచారన్న ప్రచారం ఉన్న విషయం అందరికీ తెలిసిందే . చంద్రబాబు పై విరుచుకుపడుతూ.. ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. దీంతో ప్రజల్లో కాస్త చంద్రబాబుపై వ్యతిరేకత పెంచడంలో సీఎం సఫలమయ్యాడు.


ఇప్పుడు కూడా అదే ధోరణి అవలంభించాలి అది సీఎం జగన్ ను తొక్కేసేలా, చంద్రబాబకు అనుకూలంగా మాట్లాడించాలని రఘురామ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రఘురామ అనుకుంటున్న పని సక్సెస్ అవుతుందా. అయినా జగన్ కు వ్యతిరేకంగా కేసీఆర్ ఎందుకు మాట్లాడుతారు.. మాట్లాడితే ఆయనకేం ప్రయోజనం ఉంటుంది. రఘురామ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: