
జ్వరం వచ్చినప్పుడు ఆకలి తక్కువగా ఉంటుంది, శరీరం నీటిని కోల్పోతుంది. అందువల్ల, గంజి లేదా సూప్ వంటి ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిది. వీటిలో పోషకాలు ఉంటాయి, ఇవి త్వరగా జీర్ణమవుతాయి. కూరగాయల సూప్ లేదా చికెన్ సూప్ కూడా మంచి ఎంపిక. నారింజ, నిమ్మకాయ, అరటిపండు, యాపిల్ వంటి పండ్లు తీసుకోవడం వల్ల విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉడికించిన కూరగాయలు తేలికగా జీర్ణమవుతాయి. క్యారెట్, బీన్స్, బంగాళాదుంపలు వంటివి తీసుకోవచ్చు. మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇది శరీరానికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. పప్పులో ప్రోటీన్లు ఉంటాయి, ఇవి శరీరానికి శక్తినిస్తాయి. జ్వరం నుండి కోలుకోవడానికి సహాయపడతాయి. పప్పుతో పాటు నెయ్యి కలుపుకుని తీసుకోవడం మంచిది.
అల్లం టీ జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లంలో యాంటీబయాటిక్ గుణాలు ఉన్నాయి. వేపుడు , నూనెతో చేసిన పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మసాలాలు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. జ్యూస్లు, శీతల పానీయాలు, చాక్లెట్లు వంటివి శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. పచ్చి కూరగాయలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు