మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు.. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు. చిరు రికమెండేషన్ తో ఈ సినిమా కొరటాల శివ చేస్తున్నాడని తెలుస్తుంది..

సినిమా తరువాత చిరు చేయబోయే సినిమా పై కొంత అయోమయం నెలకొంది. ముందుగా అనుకున్నట్లు ఆచార్య అయిపోగానే చిరు వినాయక్ తో లూసిఫర్ సినిమా ని చేస్తాడని అనుకున్నారు కానీ మెహర్ రాక తో ఈ సినిమా వెనక్కి వెళ్ళిపోయింది.. అంతేకాదు సినిమా స్క్రిప్ట్ కూడా ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఈ సినిమా గురించి తరువాత ఆలోచిద్దామని మెహర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చిరు.. ముందునుంచి లూసిఫర్ సినిమా కథపై చర్చ జరుగుతూనే ఉంది..

సినిమా స్క్రిప్ట్ బాధ్యతలను ముందు సుజిత్ ను తీసుకున్నారు. అతను టీమ్ తో కలిసి నెలల తరబడి ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. కానీ అది కొణిదెల క్యాంప్ ని మెప్పించలేకపోయింది. కుర్రాడు దీన్ని డీల్ చేయలేడేమో అన్న అనుమానంతో సున్నితంగా డ్రాప్ చేయించారు. తర్వాత వివి వినాయక్ సీన్లోకి వచ్చారు. అన్నయ్యతో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 రెండు రీమేక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన అనుభవం ఉండటంతో ఫామ్ లో లేకపోయినా సరే తనే రైట్ ఛాయస్ అనుకున్నారు. ఆకుల శివతో కలిసి ఇంకో ఫ్రెష్ వెర్షన్ తయారు చేశారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇదీ సంతృప్తికరంగా రాలేదట. దాంతో ఈ సినిమా చేసినట్లే అని అభిమానులు ఫీల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: