చిన్నారి పెళ్ళికూతురు అనే ధారావాహిక తో తెలుగు ప్రేక్షకులందరినీ బాలనటిగా ఎంతగానో అలరించింది అవికా గోర్. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒకసారి హీరోయిన్ అవతారమెత్తింది. ఉయ్యాల జంపాల అనే సినిమాతో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది అవికా గోర్. ఇక ఆ తర్వాత మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన చిరునవ్వుతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ పోయింది ఈ ముద్దుగుమ్మ.



 ఇక సినిమా చూపిస్త మామ సినిమా తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక హారర్ కామెడీ సినిమా అయినా  ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో హీరో నిఖిల్ కి జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది.  ఆ తర్వాత ఫిట్నెస్ పై  దృష్టి పెట్టకపోవడంతో ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. అవకాశాలు కూడా తగ్గిపోయే. ఆ తర్వాత ఎంతో బ్రేక్ తీసుకున్నా అవికా గోర్ రాజుగారి గది 3 తో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.



 ఈ సినిమాలో అవికా గోర్ నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ ఈ సినిమా విజయం మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇటీవలే అవికాగోర్ తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ప్రేమ జీవితం ఒక అందమైన అనుభవంలా  ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం ఇప్పట్లో లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇన్ని రోజుల తన ప్రార్థనలకు సమాధానం దొరికిందని తనకు నిజమైన ప్రేమ దొరికింది అంటూ తన మనసులో మాట చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: