కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా ఈ హీరోకి మంచి పాపులారిటీ ఉంది. ధనుష్ తమిళ్ సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ధనుష్ నేరుగా తెలుగు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ తెలుగు లో ఏకంగా రెండు సినిమాలకు సైన్ చేసాడు. అందులో ఒకటి క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తుండగా.. మరొకటి యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అయితే వీటిలో వెంకీ అట్లూరి సినిమా ముందుగా రానుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే వంటి సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ధనుష్ కోసం ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీ రెడీ చేశాడు.ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఇక ఈ సినిమాలో ధనుష్ జోడిగా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ధనుష్ సినిమా నుండి సంయుక్త మీనన్ హీరోయిన్ గా తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే చిత్ర యూనిట్ ఇప్పుడు మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 

అయితే ఈ సినిమా కోసం మరో హీరోయిన్ ని వెతుకుతున్న  మాట వాస్తవమే కానీ.. సంయుక్త మీనన్ ని ఈ సినిమా నుంచి తొలగించారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మరోవైపు సంయుక్త మీనన్ ప్లేస్ ని రీప్లేస్ చేసేందుకే చిత్రయూనిట్ వేరే హీరోయిన్ని వెతుకుతున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. కానీ చివరికి అసలు విషయం ఏమిటని ఆరా తీస్తే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందట. ఈ నేపథ్యంలోనే సంయుక్త మీనన్ తో పాటు మరో హీరోయిన్ ని మేకర్స్ వెతుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత ఉన్నది అని తెలియాలంటే చిత్ర యూనిట్ ఈ విషయమై క్లారిటీ ఇవ్వాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: