మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఖిలాడి' ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఈ సినిమా విడుదలైన ఒక్క రోజు తర్వాత బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్సినిమా నిర్మాత లపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. తెలుగు సినిమా నిర్మాతలు తమ అనుమతి లేకుండా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 1992 సూపర్ హిట్ మూవీ ఖిలాడి అనే తమ టైటిల్ను ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు బాలీవుడ్ చిత్ర నిర్మాత రతన్ జైన్ మాట్లాడుతూ..' మేము తెలుగు ఖిలాడి సినిమా సమర్పకుడు, నిర్మాతపై కేసు నమోదు చేశాము. అంటే హిందీ వర్షన్ మాత్రమే కాకుండా తెలుగు భాషపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 

అయితే ఇంత ఆలస్యంగా సినిమాపై కేసు వేయడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు రతన్ జైన్ స్పందిస్తూ..' నిజానికి ఫిబ్రవరి 9న కేసు వేయాలని నిర్ణయించుకున్నాం. 10 వ తేదీన ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణకు వచ్చింది. అయితే అప్పటికే సినిమా విడుదల కావడంతో సమయం మించిపోయిందని మెజిస్ట్రేట్ వ్యాఖ్యానించింది. ఖిలాడి సినిమా నిర్మాతలు ట్రేడ్ మార్క్ చట్టం కింద రిజిస్టర్ చేసిన ఖిలాడి అనే టైటిల్ ను మార్చాలి అని అని రతన్ జైన్ అన్నారు. తాను ఎలాంటి ఆర్థిక నష్టపరిహారం కోసం చూడడం లేదని.. కేవలం ఖిలాడి సినిమా ఖ్యాతి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం అని తెలిపారు. సౌత్ సినిమాల మేకర్స్ తమ టైటిల్ ను స్థానిక అసోసియేషన్లో రిజిస్టర్ చేసి హిందీలో కూడా అదే టైటిల్ తో సినిమాని విడుదల చేస్తున్నారని ఆరోపించారు.

హిందీ చిత్రాల తరహాలో టైటిల్స్ లో డబ్బింగ్ చిత్రాలను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి సి బి ఎఫ్ సి అనుమతించడమే దానికి ప్రధాన కారణం అని.. కొన్నాళ్ళ క్రితం అలా ఉండేది కాదని బాలీవుడ్ నిర్మాత జైన్ అన్నారు. దక్షిణాదిలో ఖిలాడి అనే సినిమా రూపొందుతున్న విషయం తనకు తెలియదని అన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ట్రైలర్ విడుదలైనప్పుడు ఆ విషయం తెలిసింది అని.. ఆ వెంటనే కోర్టును ఆశ్రయించాలని అన్నారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పటివరకు రవితేజ కిలాడి నిర్మాతలు ఈ విషయంపై ఇంకా స్పందించలేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: