ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్ లోకి చేరి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. బాహుబలి సినిమా తర్వాత వెయ్యి కోట్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. అలాగే బాహుబలి,దంగల్ సినిమాల తర్వాత వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా నిలవడం విశేషం.కేవలం 16 రోజులకు గాను ఈ సినిమా ఈ ఘనతను సాధించడం గమనార్హం. ఇక ఈ సినిమా తెలుగులోనే దాదాపు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేయడం విశేషంగా మారింది. 

ఇక ఓవర్సీస్లో 200 కోట్లు అలాగే బాలీవుడ్లో రెండు వందల కోట్లు సౌత్లో సుమారు 200 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారతదేశంలోనే ఈ సినిమా రికార్డు కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. బాహుబలి సినిమాని కూడా మించిపోయిందని తెలుస్తోంది. అయితే భారీ స్థాయిలో సినిమా రిలీజ్ అవ్వడం మూడు వారాల పాటు మరే సినిమా లేకపోవడంతో భారీగా పెరిగిన టికెట్ రేట్లు రోజుకు ఐదు షోలు వంటి కారణాలతో ఈ చిత్రం ఈ రేంజిలో కలెక్షన్లు రాబట్టింది అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని.. సినిమాకు అసలు కథ లేదని, కేవలం కొన్ని ఎపిసోడ్లు మీదనే నడుస్తోందననే టాక్ ఇప్పటికీ జనాల్లో వినిపిస్తూనే ఉంది.

 సినిమాలో హీరోల ఇంట్రడక్షన్ ఎపిసోడ్లు ఇంటర్వెల్ కి ముందు వచ్చే రామ్ చరణ్ ఎన్టీఆర్ల మధ్య ఫైట్ సీక్వెన్స్, క్లైమాక్స్, ఎన్టీఆర్ కొమరం భీముడు పాటలు మాత్రమే హైలెట్ గా ఉన్నాయి. ఇక దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దానికి రెండింతలు కలెక్ట్ చేయడం విశేషం. ఇక ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించగా.. వారిద్దరి సరసన ఒలివియా మోరీస్, ఆలియా భట్ హీరోయిన్గా నటించారు. ఇక అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ శరణ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR