బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినా షాహిద్ కపూర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షాహిద్ కపూర్ బాలీవుడ్ లో నటించిన సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే షాహిద్ కపూర్ తెలుగులో మంచి విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇలా తెలుగు సినిమా రీమేక్ తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్న షాహిద్ కపూర్ తెలుగులో మంచి విజయం సాధించిన జెర్సీ సినిమాను కూడా హిందీ లో రీమేక్ చేశాడు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న జెర్సీ సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యింది.  కాకపోతే ఈ సినిమా థియేటర్ లలో  విజయాన్ని సాధించలేకపోయింది. హిందీ జెర్సీ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ను ఎక్కువగా రాబట్టలేకపోయిన ఈ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

అయితే తాజాగా ఈ సినిమా రిజల్ట్ పై షాహిద్ కపూర్ స్పందించాడు. షాహిద్ కపూర్ 'జెర్సీ'  మూవీ రిజల్ట్ గురించి మాట్లాడుతూ... ‘నా హృదయానికి దగ్గరైన మూవీ జెర్సీ. ఈ మూవీ ని చూసిన ప్రేక్షకులు  ప్రశంసలు కురిపించారు. కానీ , కారోనా కారణంగా జెర్సీ సినిమా విడుదల రెండు సంవత్సరాలు ఆలస్యం అయ్యింది. దీంతో ప్రేక్షకుల అభిరుచిలో  చాలా మార్పు వచ్చి ఉండొచ్చు. దానిని మనం అర్థం చేసుకోవాలి. జెర్సీ మూవీ నా గుండెల్లోనే ఉంటుంది. అయితే జీవితంలో ఏదైనా జరగొచ్చనే పాఠాన్ని మాత్రం జెర్సీ మూవీ నుంచి నేర్చుకోగలిగాను అని తాజాగా షాహిద్ కపూర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: