మలయాళ ముద్దుగుమ్మ  నిత్య మీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.ఇకపోతే నిత్య మీనన్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `అలా మొదలైంది` మూవీతో హీరోయిన్‌గా సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ..తన అందం, అభినయం, అంతకు మించిన టాలెంట్‌తో అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది.అంతేకాకుండా తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించిన ఈ భామ.. సింగర్ గానూ ప్రశంసలు అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోన్న నిత్యా మీనన్‌.. 

ఇక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందట.ఇదిలావుంటే ఇప్పుడీ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో.. నిత్య మీనన్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అంటూ పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. అయితే ఇక నిత్యా మీనన్ పెళ్లాడబోయే అబ్బాయి కూడా నటుడే అట. అయితే మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వ్యక్తిని ఆమె వివాహం చేసుకోబోతోందట ఈమె.ఇకపోతే సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు నుండే నిత్యా మీనన్‌కు అతడితో పరిచయం ఉండేదట. కాగా ఆ పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారితీయగా.. 

ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందని అంటున్నారు.అయితే  వీరి వివాహాన్ని ఇరు కుటుంబసభ్యులు సైతం అంగీకరించారట. అయితే అంతేకాదు, నిత్యా మీనన్ పెళ్లి విషయాన్ని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయబోతోందని టాక్ నడుస్తోంది. ఇకపోతే  ఈ ప్రకటన అధికారికంగా  వస్తేగానీ.. ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు.ఇదిలా ఉంటే గతంలో కూడా నిత్యామీనన్ పెళ్లిపై ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి. కానీ వాటిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కొన్ని సందర్భాల్లో ఐతే నిత్యామీనన్ కూడా ఆ వార్తలను కొట్టి పారేశారు. ఇప్పుడు మరోసారి నిత్యామీనన్ పెళ్ళంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల ఆహా ఓటీటీ లో ఇండియన్ ఐడల్ అనే సింగింగ్ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించిన నిత్యామీనన్ ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: