
ఇలాంటి పెళ్లి వార్తలు వరుసగా వినిపిస్తుండడంతో ఇప్పుడు అభిమానుల్లో కొత్త కుతూహలం మొదలైంది – ఇండస్ట్రీలో తర్వాత పెళ్లి చేసుకునే హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా లో వినిపిస్తున్న టాక్ ప్రకారం వచ్చే ఏడాదిలో గుడ్ న్యూస్ చెప్పబోయే హీరోయిన్స్‌గా రెండు పేర్లు హాట్ టాపిక్‌గా మారాయి.వాళ్లు మరెవరో కాదు – అందాల ముద్దుగుమ్మ తమన్నా భాటియా మరియు పూజా హెగ్డే. ఇద్దరూ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా మంచి గుర్తింపు సంపాదించారు. ఒకప్పుడు ఈ ఇద్దరూ ఇండస్ట్రీని తమ అందం, అభినయంతో ఏలేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న టఫ్ కాంపిటీషన్ కారణంగా తాము వేరే దారిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా త్వరలో తమ జీవిత భాగస్వాములను ప్రకటించే అవకాశం ఉందట. అభిమానులు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో “తమన్నా వెడ్డింగ్ నెక్స్ట్!” – “పూజా హెగ్డే కూడా రెడీ!” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అన్ని అనుకున్నట్లే జరిగితే వచ్చే ఏడాదిలో ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకుని జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు చెబుతున్నాయి. అభిమానులు మాత్రం ఈ గుడ్ న్యూస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.