పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో జల్సా మూవీ ఒకటి. బద్రి మూవీ తర్వాత బాక్సా ఫీస్ దగ్గర సరైన విజయం లేని పవన్ కళ్యాణ్ 'జల్సా' మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు. 

మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా , గోవా బ్యూటీ ఇలియానా , పార్వతి మెల్టన్ ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ముఖ్య పాత్రను పోషించింది. ఇలా అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర నమోదు చేసుకున్న జల్సా మూవీ మళ్లీ థియేటర్ లలో విడుదల చేయబోతుంది.

అసలు విషయం లోకి వెళితే ... సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అన్న విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కంటే ఓ రోజు ముందు అనగా సెప్టెంబర్ 1 వ తేదీన జల్సా మూవీ ని భారీ ఎత్తున ఓవర్సీస్ లో కూడా విడుదల చేయనున్నారు. ఓవర్ సీస్ లో జల్సా మూవీ ని సరిగమ సంస్థ విడుదల చేయబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు భారీ మొత్తంలో ఓవర్ సీస్ లో విడుదల చేయడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: