అనన్య పాండే కెరీర్ ఆరంభం లోనే వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంది. అయితే గుర్తింపు వస్తుందని ఎదురు చూస్తున్న సమయం లో పాపం కరోనా కారణంగా ఆమెకు ఆఫర్లు మిస్ అయ్యాయి.

మరో వైపు విజయ్ దేవరకొండ తో నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండల పై చాలా నమ్మకం పెట్టుకున్న అనన్య పాండే కు అన్ని విధాలుగా నష్టమే జరిగింది.

లైగర్ సినిమా తర్వాత అనన్య పాండే వెంటనే ఒక తెలుగు సినిమాను కూడా చేసేందుకు కమిట్ అయింది. అయితే లైగర్ సినిమా ఫ్లాప్ అవడం తో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ సినిమా నుంచి అనన్య ను తొలగించారు . అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేయాలంటూ ఆమె కు సందేశం పంపించారట.కొద్ది మొత్తం లోనే అడ్వాన్స్ ఇచ్చారు కనుక ఆమె ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి తెలుగు లో వచ్చిన అవకాశం చేజారి పోవడం తో అనన్య పాండే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుందని రూమర్లు కూడా వచ్చాయి.. బాలీవుడ్ హీరోయిన్ గా వెలుగు వెలగాలని ఆశ పడుతున్న అనన్య పాండే సౌత్ లో కూడా వరుసగా ఆఫర్స్ వస్తాయని బాగా ఆశించింది. కానీ వచ్చిన ఒక్క ఆఫర్ కూడా లైగర్ ఫ్లాప్ కారణంగా చేజారి పోవడం తో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. బాలీవుడ్ లో మళ్లీ వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకుంటే అప్పుడు ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్స్ వస్తాయేమో మరి.విజయ్ దేవరకొండ తో నటించినందుకు చాలా నష్టం జరిగిందని కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు.. మరి కొందరు మాత్రం విజయ్ దేవరకొండ తో నటించినందుకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు కూడా లభించింది. భవిష్యత్ లో భారీగా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: