రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్ లు కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నీది అగర్వాల్ ... మాళవిక మోహన్ ... రిద్ది కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ కు పాత పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ లో ప్రభాస్ తాత పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు ... ఈ మూవీ కే ఈ పాత్ర హైలెట్ గా నిలవనున్నట్లు దానితో ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఈ చిత్ర బృందం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు ఒక వార్త చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఎలాంటి హడా విడి లేకుండా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కూడా ఎలాంటి హడా విడి లేకుండా సజావుగా సాగిపోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ మూడు రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగినట్లు తెలుస్తుంది. ఈ మూడు రోజుల షెడ్యూల్ తో కలిపి ప్రభాస్మూవీ కోసం 18 రోజులు పని చేసినట్లు తెలుస్తుంది. దీనితో ఈ మూవీ షూటింగ్ 20% వరకు పూర్తి అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేయాలి అని మారుతి మరియు ఈ మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మూవీ ని మారుతి హారర్ కామెడీ జోనర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: