బాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా అందాలతో రచ్చ చేస్తున్నారు సౌత్ బ్యూటీస్. నార్త్ భామల గ్లామర్ షో ఓ రేంజ్ లో ఉంటుంది. బట్టల్లో పొదుపు పాటించి అందాలు ఆరబోస్తారు. ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల భామలు కూడా మేమేం తక్కువ కాదు అంటూ పరువాలు ప్రదర్శిస్తున్నారు.

చిట్టి పొట్టి డ్రెస్సుల నుండి ట్రెడిషనల్ వేర్ ధరిస్తూ మత్తెక్కించే అందాలతో కుర్రాళ్లను చిత్తు చేస్తున్నారు. అదిరిపోయే స్టిల్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పుడు అందాల భామలు అందరూ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు టచ్ లో ఉంటున్నారు.

అలాంటి వారిలో తప్పకుండా చెప్పుకోవాల్సిన పేరు ఐశ్వర్య మీనన్. ఈ భామకు అందానికి అందం, అభినయం కూడా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో క్రేజ్ మాత్రం రాలేదు. లవ్ ఫెయిల్యూర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పరిచయం అయింది ఐశ్వర్య మీనన్.
తమిళం, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించింది. అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపించినా వాటి వల్ల తనకు ఎలాంటి పేరు, గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలమే అవుతున్నా చెప్పుకునే స్థాయిలో ఒక్క హిట్టూ తన ఖాతాలో లేకుండా పోయింది.

ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల చిత్రాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ మెయిన్ గా తన ఫోకస్ ను కన్నడ ఇండస్ట్రీవైపే ఉంచింది. అక్కడే తనకు మంచి క్రేజ్ ఉండటంతో దానిని క్యాష్ చేసుకునే పనిలో పడింది.

బ్యూటీ ప్రస్తుతం మలయాళంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న మాన్ సూన్ మంగూస్ అని చిత్రంలో నటిస్తోంది. అలాగే తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తున్న స్పై అనే మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండు సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఐశ్వర్య మీనన్. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టా అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసేంది. సిల్వర్ కలర్ చమ్కీల డ్రెస్సులో తన సోయగాలు ప్రదర్శించింది. ఎద అందాలతో అల్లరి చేసింది. థైస్ షోతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: