విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు దొరసాని మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో ఈ యువ నటుడు హీరోగా నటించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను భాగానే అందించింది.

ఆ తర్వాత పలు మూవీ లలో నటించి ఆనంద్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. తాజాగా ఈ యువ నటుడు బేబీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ మూవీ కి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులను ఇప్పటికే ఈ మూవీ బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

మూవీ యొక్క థియేటర్ హక్కులను ఎస్వి సినీ మాక్స్ ... సుధా సినిమాస్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం "స్పై" అనే యాక్షన్ ద్రిల్లర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకోని ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నిలకోని ఉన్న ఈ మూవీ యొక్క సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులను కూడా ఎస్ వి సినీ మాక్స్ , సుధా సినిమాస్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇలా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న ఈ రెండు సినిమాల యొక్క సీడెడ్ ఏరియా హక్కులను ఈ ప్రముఖ సంస్థలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: