భారతీయ చలన చిత్ర పరిశ్రమ తీరుని ఒకసారి చూసుకుంటే బాలీవుడ్ నుంచి కోలీవుడ్ టాలీవుడ్, మాలీవుడ్ ఇలా అనేక భాషలలో చలన చిత్రాలు నిర్మిస్తారు. అయితే ఇపుడు అందులో ఎక్కువగా ప్రతీ ఏటా నిర్మించేది మాత్రం కచ్చితంగా టాలీవుడ్ అని చెప్పాలి. ఇక గత కొన్నేళ్ళుగా టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా మూవీస్ అంటూ ఏకంగా బాలీవుడ్ నే టార్గెట్ చేస్తోంది.

ఈ పరిణామలా నేపధ్యంలో టాలీవుడ్ లో అరడజన్ కి పైగా హీరోలు పాన్ ఇండియా బాటన పట్టారు. వారి సినిమాలు మూడు వందల కోట్ల నుంచి అయిదు వందల కోట్ల దాకా బడ్జెట్ తో నిర్మాణం అవుతున్నాయి. ఇక ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ప్రభాస్ వి రెండు, రాజమౌళిది ఒకటి, పూరీ జగన్నాధ్ ది మరోటి, అల్లు అర్జున్ పుష్ప‌ మూవీ ఇంకోటి ఇలా అయిదారు సినిమాల దాకా పాన్ ఇండియా కోసం రెడీ అవుతున్నాయి.

ఈ మూవీస్ అన్నీ కూడా వరసపెట్టి సమ్మర్ తరువాత రిలీజ్ కి సిధ్ధంగా ఉన్నాయి. అయితే ఇపుడు దేశంలో కరోనా పరిస్థితులు మళ్ళీ దారుణంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా కరోనా మహమ్మరి సెకండ్ ఫేజ్ కూడా విస్తరిస్తోంది అని కూడా అంటున్నారు. ఈ పరిణామాలతో పాన్ ఇండియా మూవీ మేకర్స్ టెన్షన్ పడుతున్నారుట. ఏ మాత్రం తేడా వచ్చినా వందల కోట్లు మునిగిపోతానన్నదే ఆ టెన్షన్.

ఇక టాలీవుడ్ లో మిగిలిన సినిమాల ఖర్చు కూడా ఏం తక్కువగా లేదు. చిరంజీవి ఆచార్య కూడా వంద కోట్లను దాటి బడ్జెట్ ని పెడుతున్నారు. అలాగే వెంకటేష్ నారప్ప, బాలయ్య బోయపాటి మూవీతో పాటు అనేక చిత్రాలు సమ్మర్ ని టార్గెట్ చేశాయి. ఆ టైమ్  కి మంచి కలెక్షన్లు రాబడదామని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి దాకా రిలీజ్ అయిన సినిమాలు చిన్నవి, మీడియం రేంజివే. అసలు సినిమాలు సమ్మర్ నుంచే థియేటర్లలోకి వస్తున్నాయి. మరి ఆ సమయానికి కనుక కరోనా మహమ్మారి దారుణంగా ఉంటే పరిస్థితి ఏంటి అన్నది టాలీవుడ్ ని అతలాకుతలం చేస్తోందిట. చూడాలి మరి సెకండ్ ఫేజ్ కనుక రాకుండా ఉంటే అంతా సేఫ్ అయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: