దుల్కర్ సల్మాన్ హీరో గా మృణాళిని ఠాకూర్  హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించాడు. ఈ సినిమా ఆగస్ట్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది.

మొదటి నుండి మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ని బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకొని మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. మొదటి రోజు సీతా రామం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.05 కోట్ల షేర్ 6.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసింది.

రెండవ రోజు సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3.63 కోట్ల షేర్ , 7.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసి బాక్సా ఫీస్ దగ్గర సీతా రామం మూవీ అద్భుతమైన గ్రోత్ ని సాధించింది. మరి మూడవ రోజు అయిన ఆదివారం రోజు సీతా రామం సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి. ఈ మూవీ లో సుమంత్ , గౌతమ్ వాసుదేవ్ , మీనన్ తరుణ్ ,  భూమిక చావ్లా ముఖ్య పాత్రల్లో నటించగా ప్రకాష్ రాజ్ , సునీల్ , ప్రియదర్శి ఇతర  పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: