టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్గా గుర్తింపును సంపాదించుకున్న ప్రియమణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఇండస్ట్రీలో అగ్ర హిరోయిన్ గా హవా నడిపిస్తూ.. దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ బస్టర్ విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత కాలంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ప్రియమణి.. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఒకవైపు సీనియర్ హీరోల సరసన హీరోయిన్గా నటిస్తునే ఇంకోవైపు.. ఇతర హీరోల సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది. ఇక వెబ్ సిరీస్లలో కూడా వైవిద్యమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


 ఒకప్పుడు హీరోయిన్ గా ఉన్న సమయంలో కేవలం సౌత్ ఇండస్ట్రీలోని వివిధ భాషల్లో మాత్రమే నటించిన ప్రియమణి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం బాలీవుడ్ లో కూడా సందడి చేస్తుంది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇటివలె భామ కలాపం 2 అని లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా నటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ప్రియమణి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రియమణి ముస్లిం మతానికి చెందిన మహిళ అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది  ఎందుకంటే ఇటీవల ముస్లిం మహిళగానే ఆమె సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.


 రంజాన్ కావడంతో ముస్లిం మహిళలు ధరించే దుస్తులు ధరించి ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే వాస్తవానికి హిందూ అయినా ప్రియమణి ఇక ఇప్పుడు ముస్లింగా మారింది అన్న విషయం చాలామందికి తెలియదు. ప్రియమణి bollywood ACTOR' target='_blank' title='ముస్తఫా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ముస్తఫా రాజ్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ముస్తఫాకు ప్రియమణితో వివాహం రెండో వివాహం కావడం గమనార్హం. వీరిద్దరూ కూడా అన్యోన్య దంపతులుగా కొనసాగుతున్నారు. ఇలా bollywood ACTOR' target='_blank' title='ముస్తఫా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకోవడం వల్ల ముస్లిం మహిళగా మారిపోయింది ప్రియమణి. ఇటీవల రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం దుస్తుల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: