సినిమా ఇండస్ట్రీలో పరిస్ధితులు పూర్తిగా మారిపోతున్నాయ్. స్టార్ హీరోలు అందరూ కూడా హై రేంజ్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయకుండా కంటెంట్ ఉన్న క్యారెక్టర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన కుబేర సినిమాలో ధనుష్ పర్ఫామెన్స్ ఎంత హైలైట్ గా నిలిచింది అనే విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . ఎక్కడ చూసినా సరే ధనుష్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ప్రశంసలు కురిపించేస్తున్నారు.  ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ధనుష్ లా లేడు అని.. ధనుష్ లా ఏ హీరో బిచ్చగాడు క్యారెక్టర్ నటించడు అని ఓ రేంజ్ లో ఆయన పేరుని మారుమ్రోగిపోయేలా చేస్తున్నారు.


కాగా ఇదే మూమెంట్లో గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ తమ సినిమాలలో బిచ్చగాడి గెటప్ లో నటించాల్సి ఉండగా కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసిన సందర్భాలను తెరపైకి తీసుకొస్తున్నారు.  ఇందులో ప్రభాస్ పేరు కూడా ఉండడం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్న ప్రభాస్ కూడా ఒక సినిమాలో బిచ్చగాడి గెటప్ లో కనిపించాలట . కానీ ఆయన ఫ్యాన్స్ అలా తట్టుకోలేరు అని చెప్పి డైరెక్ట్ గా ఆ సీన్స్ ని తెరకెక్కించడమే మానేశారట.



ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా..? "పూరి జగన్నాథ్".  ఉన్నది ఉన్నట్లు తెరకెక్కించే డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు . పూరి జగన్నాథ్ పేరు చెప్తే సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ పొగడ్తలు వినిపిస్తాయో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా "ఏక్ నిరంజన్".  ఈ సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.  అనుకున్నంత హిట్ కాకపోయినా ప్రభాస్ అభిమానుల్ని ఎంటర్టైన్ చేసింది.  ఈ సినిమాలో చిన్నప్పుడు ప్రభాస్ ఎన్ని ఇబ్బందులు పడతాడు అనేది అందరికీ తెలిసిందే.



తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరమై ఆ తర్వాత నానా తిప్పలు పడతాడు . ఈ సినిమాలో ప్రభాస్ ఒకానొక టైంలో ఎవ్వరు లేక బిచ్చగాడిలా అడుక్కునే సీన్స్ కూడా రాసుకున్నారట పూరీ జగన్నాథ్ . కానీ ప్రభాస్ ఇమేజ్ డామేజ్ అయిపోతుంది అని ఫ్యాన్స్ ఒప్పుకోరు అని పూరి జగన్నాథ్  ఆ సీన్స్ ని మొత్తం తెరకెక్కించకుండా ఆపేసారట . ఆ కథని వేరే విధంగా మ్యానేజ్ చేసి తెర పై కి  తీసుకొచ్చారట . ఒకవేళ అన్ని సెట్ అయి ఉంటే అప్పుడే ప్రభాస్ ని అలా బిచ్చగాడి గెటప్ లో చూపించుంటే ఇప్పుడు ధనుష్ అందుకుంటున్న  ప్రశంసలన్నీ అప్పుడు ప్రభాస్ అందుకునేవాడు.  ప్రభాస్ ఏ క్యారెక్టర్ కైనా బాగా సూట్ అవుతాడు.  అంతలా నటించే క్యారెక్టర్ ప్రభాస్ ది . ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమా షూట్లతో బిజీగా ఉన్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: