హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ‘ F1’ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది . జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 2,656 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి . ఈ గ్రాండ్ ఓపెనింగ్‌తో 'F1' సినిమా కు గ్లోబల్ స్టేజ్ పై భారీ హిట్ ట్యాగ్ దక్కింది .. అంతేకాదు , ఇండియాలో కూడా ఈ చిత్రం ఆశాజనకం గా రన్ అవుతోంది . ఇప్పటికే రూ.70 కోట్ల మార్క్‌ను దాటి , త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో కి ఎంటర్ అయ్యే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .


విశ్వవ్యాప్తంగా F1 దుమ్మురేపిన వసూళ్లు.. ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే అమెరికా, యూరోప్ , ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలు నడిచినట్టు తెలుస్తోంది . అత్యాధునిక విజువల్స్ , సస్పెన్స్ థ్రిల్లింగ్ కథ , బ్రాడ్ పిట్ మ్యాజిక్ కలిసివచ్చి ఈ రేంజ్ కలెక్షన్ల కు దారి తీశాయని అంటూన్న‌రు .. ఇండియాలో టాప్ హాలీవుడ్ గ్రాసర్స్ లిస్ట్‌లోకి F1.. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (రూ.480 కోట్లు +) ఇప్పటికీ అగ్రస్థానంలో ఉండగా, ‘ F1’ కూడా అదే లెవెల్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు డబ్బింగ్ వెర్షన్లకు మంచి స్పందన లభించడమే ఇందుకు కారణం.



హైప్స్:బ్రాడ్ పిట్ నటనకు మెప్పుతో పాటు , టెక్నికల్ స్టాండర్డ్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో, యూత్, మాస్, సిటీ ఆడియన్స్‌కి అన్ని మార్కెట్లలో బాగానే కనెక్ట్ అయింది. ‘ F1’ సినిమా హాలీవుడ్‌లో మాత్రమే కాదు, భారత్ సహా ఆసియాలోనూ మాస్ ఆడియన్స్ కు భారీ ఎంటర్టైనింగ్ ట్రీట్ అందిస్తోంది . 2 వారాల్లోనే వసూళ్ల పరంగా ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా ప్రశంసనీయం . ఇక త్వరలోనే ఇండియాలో 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి మరో మైలురాయిని నమోదు చేయనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: