ప్రస్తుత కాలంలో తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి ఈ సమాజంలో తనకు సాయం చేసిన వారిని గుర్తుంచుకొని మరీ గుడి కట్టి పూజించే మనుషులు కూడా ఉన్నారు.. సాయమే మనకు అపాయంగా మారుతున్న సమాజంలో తన లైఫ్ ని తీర్చిదిద్దిన ఆ డైరెక్టర్ కి ఈ నటుడు ఏకంగా తన ఇంట్లో ఓ గుడి లాగా ఏర్పాటు చేసే ఆయన ఫోటో పెట్టి ప్రతిరోజు పూజిస్తారట. ఇంతకీ ఆ నటుడు ఎవరయ్యా అంటే సుమన్ శెట్టి.. సినిమా ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో నటించినటువంటి సుమన్ శెట్టి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఒకప్పుడు బిజీ యాక్టర్ గా తెలుగు,తమిళ ఇండస్ట్రీలో  300కు పైగా సినిమాల్లో నటించిన ఈయన, ప్రస్తుతం ఆఫర్లు లేక బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టారు.

 బిగ్ బాస్ లోకి 13వ కంటెస్టెంట్ గా వచ్చిన సుమన్ శెట్టి తన జీవితంలో ఎదుర్కొన్న విషయాలు నాగార్జునతో ఆయనకున్న అనుబంధాన్ని గురించి మాట్లాడారు. తాను అనేక భాషల్లో నటించానని కానీ జయం సినిమానే తన లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో తనకు మొదటిసారి ఛాన్స్ ఇచ్చింది డైరెక్టర్ తేజ అంటూ తెలిపారు. ఇప్పుడు బిగ్ బాస్ అనేది తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి ఛాన్స్ గా మార్చుకుంటానని తెలియజేశారు. ఇదే తరుణంలో 7/గా బృందావన కాలనీ సినిమాలోని డైలాగ్స్ చెప్పమని నాగార్జున అడగగానే  సుమన్ శెట్టి డైలాగ్స్ చెప్పి నాగార్జునని మెస్మరైజ్ చేశారు. ఇదే క్రమంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 సుమన్ శెట్టి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయం సినిమా ద్వారా తనను వెలుగులోకి తీసుకువచ్చిన తేజగారి  వల్లే నేను ఇల్లు కట్టుకున్నానని ఆయనే నాకు లైఫ్ అందించారని.. అంతేకాదు ఆ ఇంట్లో ఒక స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసి అందులో తేజ గారి ఫోటో పెట్టుకొని ఒక గుడి లాగా ప్రతిరోజు పూజిస్తానని చెప్పుకొచ్చారు. అలా ప్రస్తుతం సుమన్ శెట్టి  బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో సుమన్ శెట్టి బిగ్ బాస్ ద్వారా మంచి స్థాయికి వెళ్లి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో ఆఫర్లు పొందాలని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: