
ఇటీవల విడుదలైన కాంతార చాప్టర్1 సినిమా పెను సంచలనాలను సృష్టిస్తోంది. అయితే ఇంతటితో హోంబలే విజృంభన అయిపోలేదు.. రాబోయే రోజుల్లో అసలు సిసలైన పండగ రాబోతోంది.ఆ సంస్థ నుంచి మరిన్ని బడ చిత్రాలు రాబోతున్నాయి. హోంబలే చిత్రాన్ని నిలబెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 3, సలార్ 2 వంటి చిత్రాలు చేయబోతున్నారు. అలాగే మరొకవైపు మహా అవతార్ సిరీస్ లో భాగంగా పరుశురామ, కల్కి లాంటి చిత్రాలు కూడా రాబోతున్నాయి.
అలాగే ఇతర భాషలలోని టాప్ హీరోల చిత్రాలను, మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు వినిపిస్తోంది హోంబలె. ప్రభాస్ తో ఒక సినిమా కమిట్మెంట్ ఉన్నట్లుగా సమాచారం. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ తో టైసన్ అనే సినిమా చేయబోతోంది. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో ఒక సినిమా చేయబోతున్నారట. సొంత భాషలో హీరో అయిన రక్షిత్ శెట్టితో కూడా రిచర్డ్ ఆంటోనీ, కాంతార చాప్టర్2, తమిళంలో సుధా కొంగర డైరెక్షన్లో హీరో సూర్య గా నటించబోతున్న ఒక చిత్రం. ఇలా పాన్ ఇండియా స్థాయిలో హోంబలే పేరు మారుమోగిపోయే చిత్రాలతో రాబోతోంది.